Thursday, April 25, 2024

ఆటోలో నుంచి రోడ్డుపై ప‌డిన చిన్నారి – చాక చ‌క్యంగా కాపాడిన ట్రాఫిక్ పోలీస్

ఓ ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై ప‌డిపోయిన చిన్నారిని చాక చ‌క్యంగా కాపాడాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఈ ఘటన జరిగింది. ఒక ట్రాఫిక్ పోలీస్ రద్దీగా ఉన్న రోడ్డులో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఆటో నుంచి ఓ చిన్నారి జారి రోడ్డు మీద పడిపోయింది. అది గమనించిన ట్రాఫిక్ పోలీస్ హుటాహుటిన ఆ చిన్నారి దగ్గరికి చేరుకున్నాడు. ఆ చిన్నారి మీదికి ఏ వాహనం రాకుండా అడ్డుకుని వెంటనే ఆ పాపను ఎత్తుకుని పక్కకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. చిన్నారిని రక్షించిన పోలీస్ మీద అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement