Thursday, April 25, 2024

Follow up : అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. వరుసగా రెండవ రోజూ నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్‌

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు వరుసగా రెండవ రోజూ నష్టాల్లో ముగిశాయి. గురువారం ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదేబాటలో చలించాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు అప్రమత్తం అయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,524 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,848-60425 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 419 పాయింట్లు నష్టపోయి 60,613 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 128పాయింట్లు నష్టపోయి 18,028 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీసూచీ 18000 స్థాయిలను బ్రేక్‌ చేసుకుని కిందకు వచ్చినప్పటికీ, ముగింపు సమయానికి కీలక మార్కుకు పైకి చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.81.76 వద్ద కొనసాగుతున్నది. సెన్సెక్స్‌-30 ఇండెక్స్‌లో కేవలం 6 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలతో ట్రేడవడం మార్కెట్‌ సెం టిమెంట్‌ను దెబ్బతీసింది.

- Advertisement -

రెండేళ్ల కనిష్టానికి క్రిప్టోలు..

పరిమాణం పరంగా అతిపెద్ద క్రిఎ్టో ఎక్చేంజ్‌ బైనాన్స్‌ తమ ప్రత్యర్థి సంస్థ ఎఫ్‌టీఎక్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చర్యను క్రిఎ్టో చరిత్రలోనే అతిపెద్దదిగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం నలుగురికి తెలిసేలోగానే బైనాన్స్‌ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎఫ్‌టీఎక్స్‌లో సమస్యలు నియంత్రించలేని స్థాయికి చేరాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఇప్పటికే భారీగా పతనమైన క్రిఎ్టో మార్కెట్‌ను ఈ కబురు మరింత కృంగదీసింది. ప్రధాన క్రిఎ్టో కరెన్సీ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఏడాది కిందట బిట్‌కాయిన్‌ 69వేల డాలర్ల వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. అప్పటితో పోల్చితే దాదాపు 75శాతం పతనమైంది. ఎఫ్‌టీఎక్స్‌ ప్రధాన వాటాదారుగా ఉన్న సొలానా బుధవారం ఒక్కరోజే 50శాతానికి పైగా నష్టపోయింది. 2021లో నమోదైన గరిష్ట స్థాయినుంచి ఇప్పటి వరకు ఈ కాయిన్‌ 93శాతం విలువను నష్టపోయింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా క్రిప్టో మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement