Wednesday, April 17, 2024

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం..

రష్యాకు చిర్రెత్తే పని అమెరికా చేసింది. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, ఆయుధ సాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ సోమవారంనాడు సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం ఉక్రెయిన్‌కు మరో 40 బిలియన్‌ డాలర్ల సాయం అందుతుంది. రష్యాను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అటు అమెరికా, ఇటు యూరోపియన్‌ దేశాలు అండగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ బిల్లును కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉంది.

ఈ ప్యాకేజీని అత్యవసరంగా కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉందని బిడెన్‌ కోరారు. ఉక్రెయిన్‌కు అంతరాయం లేకుండా ఆయుధాలు, మానవతా సాయం అందించాలంటే పదిరోజుల్లోగా ఈ బిల్లుకు ఆమోదముద్ర పడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించాలంటే ఇది కీలకమని బిడెన్‌ అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement