Monday, December 9, 2024

Passenger | మహిళపై మూత్ర విసర్జన… ప్రయాణికుడిపై 30 రోజుల నిషేధం

న్యూయార్క్‌-ఢిల్లి విమానంలో ప్రయాణిస్తూ మద్యంమత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఎయిర్‌ ఇండియా చర్యలు తీసుకుంది. తమ విమానాల్లో ప్రయాణించకుండా 30 రోజుల పాటు అతనిపై నిషేధం విధించింది. అతడిని నో ఫ్లై జాజితాలో చేర్చాలని డీజీసీఏకు సిఫారసు చేసినట్టు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రస్తుతం దీనిపీ డీజీసీపీ కమిటీ దర్యాప్తు చేస్తోంది. గతేడాది నవంబర్‌ 26వ తేదీన న్యూయార్క్‌ నుంచి ఢిల్లి వస్తున్న ఏఐ-102 విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు బిజినెస్‌ క్లాస్‌ లో కూర్చున్న ఒక మహిళ దగ్గరకు వచ్చి ఆమెపై మూత్రవిసర్జన చేసిన విషయాన్ని ఎయిర్‌ ఇండియా ధ్రువీకరించింది.

నవంబర్‌ 26న జరిగిన ఈ భయానక ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. భోజనం తర్వాత లైట్లు ఆర్పేసిన సమయంలో నిందితుడు తన వద్దకు వచ్చి తనపై మూత్ర విసర్జన చేశాడని, అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని ఆమె తెలిపారు. అతను కదలకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపొమ్మని తక్కిన ప్రయాణికులు మందలించారని, అప్పుడే అతను అక్కడి నుంచి కదలాడని తెలిపింది. తన బ్యాంగు, షూస్‌, బట్టలు తడిసిపోయాయని, విమాన సిబ్బంది వేరే చోట తనను కూర్చోబెట్టి, ఆ సీటును షీట్లతో కవర్‌ చేసి, డిస్‌ఇన్ఫెక్టెంట్‌తో స్ప్రే చేసి గంట తర్వాత అక్కడకు వెళ్లిపొమ్మారని తెలిపింది. బిజినెస్‌ సీట్లు ఖాళీగా ఉన్నా తనకు సీటు కేటాయించలేదని వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement