Friday, March 29, 2024

17న ఉపేంద్ర ‘క‌బ్జ‌’…

ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కబ్జ’. పాన్‌ ఇండియాగా ఈ చిత్రం మార్చి 17న విడుదలవుతుంది. ఆర్‌.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ఎన్‌.సుధాకర్‌ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్‌ రుచిరా ఎంటర్‌-టైన్‌మెంట్స్‌, ఎన్‌ సినిమాస్‌ పతాకాలపై తెలుగులో రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా -టైటిల్‌ సాంగ్‌ను హైదరా బాద్‌లో విడుదల చేశారు. ఈ కా ర్యక్రమంలో ఉపేంద్ర, శ్రియా శర న్‌, దర్శకుడు ఆర్‌.చంద్రు సహా టీ-మ్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.


ఉపేంద్ర మాట్లాడుతూ ” చంద్రు గురించి మాత్రమే మాట్లా డుతాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్‌ అయిన తర్వాత కరోనా కూ డా వచ్చింది. అయితే చంద్రు వెన క్కి తగ్గలేదు. ” అన్నారు.
దర్శకుడు ఆర్‌.చంద్రు మాట్లాడుతూ ”నా కెరీర్‌లో ఇది తొలి పాన్‌ ఇండియా మూవీ. ఉపేంద్రగారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ డ్రీమ్‌ పూర్తి కావటానికి ఆయనే కారణం. ” అన్నారు. నిర్మాత సాయినాథ్‌ మాట్లాడు తూ ”కబ్జ -టైలర్‌లో చూసింది కొంత మాత్రమే. రేపు థియేటర్స్‌లో అందరి అం చనాలను మించి ఉంటు-ంది.” అన్నారు. శ్రియా శరన్‌ మాట్లాడుతూ ”కబ్జ సిని మాలో నన్ను భాగం చేసిన చంద్రుగారికి థాంక్స్‌. సినిమా కథ వినగానే నచ్చే సింది. ఇందులో తల్లి పాత్రలో నటించాను. మా అమ్మాయి రాధ గురించి ఎప్పు డూ చంద్రు, ఆయన భార్య అడుగుతుండేవారు. పాపకి బహుమతులు ఇచ్చేవా రు.” అన్నారు. అతిథిగా హాజరైన విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ”ఉపేంద్ర ఐడియాలజీని నేను లవ్‌ చేస్తాను. నేను డైరెక్ట్‌ చేసిన సినిమాకు ఉపేంద్రగారినే కొంత స్ఫూర్తిగా తీసుకున్నాను.” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత హనుమంత రెడ్డి, అలంకార్‌ , రచయిత చంద్ర బోస్‌, డి.వి.వి.దానయ్య, వరదరాజు , లగడపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement