Saturday, April 20, 2024

UP | యూనివర్సిటీలో మతపరమైన వేధింపులు.. కొరియన్​ స్టూడెంట్స్​కి అవమానం!

తమ స్నేహితుడిని కలవడానికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వచ్చిన ఇద్దరు కొరియన్​ యువతులకు మతపరమైన వేధింపులు ఎదురయ్యాయి. ఢిల్లీకి చెందిన ఈ ఇద్దరు కొరియన్ యువతులను హిందూత్వ కార్యకర్తలు వారి మతపరమైన అంశాన్ని లేవనెత్తి వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఆ యువతులిద్దరూ తమ స్నేహితుడు విద్యార్థి చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన క్రమంలో ఈ ఘటన జరిగింది.

కాగా, ఆ యువతులను మతపరమైన ప్రశ్నలతో వేధిస్తున్న వ్యక్తుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి హల్​చల్​ అవుతోంది. వేధింపులకు గురిచేస్తున్న వారిలో ఒకరు “ఈశ్వర్ బస్ రామ్ హై, ఔర్ కోయి ఈశ్వర్ నహీ హై (రాముడు ఒక్కడే, మరొకడు లేడు)” అని చెప్పడం వీడియోలో వినబడుతోంది. ఇంకా ఆ యువతనుల “క్రైస్తవులు మిషనరీలు” అని కామెంట్స్​ చేయడం కూడా వినొచ్చు.

“యే యహాన్ క్రిస్టియన్స్ మిషనరీస్ హై జో ఇధర్ ఆనా చా రహే హై (వారు ఇక్కడికి రావాలనుకునే క్రైస్తవ మిషనరీలు)” అని వారిలో ఒకరు చెప్పడం వినవచ్చు.

- Advertisement -

అయితే.. ఈ విషయంపై మీరట్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. “వీడియోలో సంబంధిత మహిళ ఒక మతాన్ని ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో ఉందని… అయితే అది నిజం కాదు, తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఇక.. వీడియోలో ఏముందన్నది ఇక్కడ చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement