Thursday, March 28, 2024

అయోధ్య నుంచి బరిలోకి యోగీ ఆదిత్యనాథ్..

యూపీలో అప్పుడే ఎన్నికల కసరత్తులు మొదలు పెట్టాయి పార్టీలు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తన పట్టును తిరిగి నిలుపుకోడానికి సంచల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన శాసన మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన  పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం యోగిని ఈసారి అయోధ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.

ప్రస్తుతం అయోధ్య నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదప్రకాశ్ గుప్త సీఎం యోగి కోసం ఈ సీటును త్యాగం చేయనున్నారు. ఇందుకు ఆయన సంతోషకరంగా అంగీకరించారు. సీఎంతో పాటు పాటు ఇతర కీలక నేతలైన డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ లక్నో పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు సీఎం యోగిని ఈసారి ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం చర్చోపచర్చలు చేసినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం పెద్దలు ఇదే విషయంపై కొన్ని రోజుల పాటు మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : ఒలింపిక్స్‌ అథెట్లకు ప్రధాని మోదీ విషెస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement