Friday, March 29, 2024

అన్ స్టాప‌బుల్2 బాల‌య్య‌..ప‌వ‌న్ క‌ల్యాణ్ షో.. రికార్డ్ సెట్

అన్ స్టాప‌బుల్2కి హీరో బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తున్నారు. కాగా ఈ షోకి గెస్ట్ గా వ‌చ్చారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అన్ స్టాప‌బుల్ షోలో తనదైన స్టైల్ లో రాజకీయంగా, కుటుంబ పరంగా, సినిమా పరంగా ప్రశ్నలు అడగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే ప్రసాద్ ల్యాబ్ లో స్క్రీనింగ్ వేశారు. ఇక విజయవాడలో పెద్ద కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.హై రెస్పాన్స్ వల్ల పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఈ ఇంటర్వ్యూను రెండు ఎపిసోడ్లుగా మార్చారు. కాగా గురువారం రిలీజ్ అయిన మొదటి ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది అని ఆహా టీమ్ ప్రకటించింది. ఈ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా వచ్చిన ఎపిసోడ్ పేరుకి తగ్గట్టుగానే దూసుకుపోతోంది. ఆహా లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది..హీరో బాల‌కృష్ణ‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్ స్టాప‌బుల్ 2 షో..ఈ మేర‌కు ఆహా టీమ్ వారు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో బ్లాక్ సోక్కా ఏసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆనందంగా రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement