Thursday, April 25, 2024

జోరు తగ్గని కిమ్‌, బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం.. లెక్క చేయని అమెరికా హెచ్చరిక

క్షిపణుల ప్రయోగాల్లో ఉత్తర కొరియా దూకుడు ఆగడం లేదు. క్షిపణి ప్రయోగాలు చేపడుతూనే ఉందన్నారు. తాజాగా తూర్పు తీరం నుంచి గుర్తు తెలియని ప్రొజెక్టెల్‌ను ప్రయోగించినట్టు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గురువారం ప్రకటించింది. జపాన్‌ కోస్‌్టగార్డు సైతం దీన్ని బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగంగా అనుమానిస్తూ.. తమ నౌకలను అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. ఈ క్షిపణి.. తమ ప్రత్యేక ఆర్థిక జోన్‌ జలాల్లో పడిపోయినట్టు జపాన్‌ ప్రభుత్వం తెలిపింది.

బాలిస్టిక్‌ క్షిపణి.. 71 నిమిషాల పాటు గాల్లో ఎగిరి.. హోక్కైదో ఒషిమా ద్వీపకల్పానికి తూర్పున 150 కి.మీ దూరంలో జపాన్‌ సముద్రంలో పడిపోయింది. ఆరువేల కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో క్షిపణి ప్రయాణించింది. ఇది 2017 నవంబర్‌ తరువాత ప్రయోగించిన హ్వాసాంగ్‌ 15 ఐసీబీఎం కంటే చాలా ఎక్కువ. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 13కు చేరుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement