Friday, April 19, 2024

పెరూలో నిర‌స‌న జ్వాల‌లు.. మచు పిచ్చు సంద‌ర్శ‌న‌కు నో ప‌ర్మిష‌న్

పెరూలో నిర‌స‌న జ్వాల‌లు కొన‌సాగుతుండ‌టంతో ప్రపంచ ప్రఖ్యాతి గావించిన మ‌చ్చు పిచ్చు సంద‌ర్శ‌న‌కు పర్యాటకులను ప్రభుత్వం అనుమతించడం లేదు. టూరిస్ట్‌ స్పాట్‌ అయిన ఈ చారిత్రక ప్రాంతానికి పర్యాటకులు రావడాన్ని నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఆందోళనకారులు మచు పిచ్చుకు వచ్చే రైల్వే లైన్లను ధ్వంసం చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో 417 మంది చిక్కుకుపోయారని చెప్పారు. వారిలో 300 మంది విదేశీయులు ఉన్నారని చెప్పారు. కాగా, ఈ నెల 21, ఆ తర్వాతి రోజుల్లో మచు పిచ్చు సందర్శనకు టికెట్లు బుక్‌చేసుకున్నవారికి త్వరలోనే డబ్బును తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జాతీయ సమ్మె తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement