డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజురోజుకూ పడిపోతుండగా శుక్రవారం కూడా అదే విధంగా డీలాపడి రూ.79.86ల వద్ద స్థిరపడింది. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే 80.06 రూపాయలకు పడిపోయిన రూపాయి విలువ గురువారం కాస్త తేరుకుని 79.85 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం లావాదేవీలు ప్రారంభం కాగానే రూ.79.90తో ప్రారంభమై 79.86వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లు పుంజుకోవడం, విదేశీ మదుపరులు పెట్టుబడులు పెరగడం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో రూపాయి కొంతలో కొంత తేరుకున్నట్టయ్యింది.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.