Thursday, April 25, 2024

కరోనా ఇకపై సీజనల్ వ్యాధి..?: ఐక్యరాజ్యసమితి

కరోనా వైరస్ పై ఐక్యరాజ్యసమితి కీలక ప్రరటన చేసింది. కరోనా వైరస్ కేసులు ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై యూఎన్‌ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగా ఈ హెచ్చరిక జారీ చేసింది. శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే కరోనా సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement