Friday, June 9, 2023

నా జీవితంలో మ‌ర‌చిపోలేని మ‌ధుర క్ష‌ణాలు ఇవే.. చంద్ర‌బోస్

ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటుపాట‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావ‌డం ప‌ట్ల స్పందించారు గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్. ఆర్ఆర్‌ఆర్‌ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం దక్కించుకున్న నేపథ్యంలో ఆ గీత రచయిత చంద్రబోస్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివని చెప్పారు. 3,500లకు పైగా పాటలు రాసిన తనకు.. ప్రతి పాట ఓ తపస్సు లాంటిదే అన్నారు. ఈ సారి ‘నాటు నాటు’ పాటకు చేసిన తపస్సుకు ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఇచ్చిన వరం.. ఈ పురస్కారం అని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement