Wednesday, April 17, 2024

పొన్నియన్ సెల్వన్-2పై క్రియేట్ కాని హైప్.. సినిమా రేంజ్‌ను డిసైడ్ చేయనున్న ట్రైలర్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెన్లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ టాక్ తో తమిళనాడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. తమిళ సినీ వర్గాలు, ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతో గర్వంగా స్వీకరించారు. అయితే, PS-1 ఇతర భాషలలో అదే ప్రభావాన్ని చూపలేకపోయింది. మొదటి భాగం ఇతర సినీ మార్కెట్‌లలో విఫలమవడంతో.. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం కూడా ఇతర మార్కెట్‌లలో చాలా తక్కువ బజ్‌ను క్రియేట్ అవుతుంది.

ఈ సినిమాకి హై బజ్ క్రియేట్ కావాలి అంటే మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన రావాలి. ట్రైలర్ నుండి సరైన సందడి ప్రారంభం కావాలి. ఈ నెల (మార్చి) 29న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ 3 నిమిషాల 25 సెకన్లు అని కూడా వెల్లడించారు చెప్పారు. ఈ సినిమాకి ఇతర భాషల్లో కూడా మంచి బజ్ క్రియేట్ కావాలి అంటే అది ప్రస్తుతం ఈ ట్రైలర్ పైనే ఆదారపడి ఉంది. అప్పుడే సినిమాకి కావలసిన బజ్ అన్ని సినీ మార్కెట్లలో క్రియేట్ అవుతుంది.

పొన్నియిన్ సెల్వన్ 2 తారాగణంలో కార్తీ, జయం రవి, విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ప్రకాష్ రాజ్, ప్రభు, అశ్విన్, మోహన్ రామ్, శరత్ కుమార్, పార్థిబన్, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు తదితరులు ఉన్నారు. సాంకేతిక బృందంలో సంగీతం ఎఆర్ రెహమాన్, డిఓపి రవి వర్మన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ మరియు ఆర్ట్ డైరెక్షన్ తోట తరణి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement