Sunday, March 26, 2023

ఎనిమిది బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం.. శాసనసభలో పలు బిల్లులపై చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర శాసనసభ ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయమే తీర్మానాల అనంతరం ఎనిమిది బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. వరుసగా బిల్లులపై చర్చ అనంతరం మోటార్‌ వెహికిల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, ఆజామాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ సూపరెన్యూయేషన్‌ సవరణ బిల్లులను మంత్రులు సభకు ప్రతిపాదించగా శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకు ఆమోదంతో రాష్ట్రంలో కొత్తగా కావేరీ, గురునానక్‌, శ్రీనిధి, ఎంఎన్‌ఆర్‌, నిక్‌మార్‌ వర్సిటీలకు అనుమతి దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement