Friday, April 19, 2024

మేరియుపోల్‌లోనూ మారణహోమమే.. రష్యా దాడుల్లో వేలాది మంది మరణించి ఉండొచ్చు

రష్యా యుద్ధం వల్ల దక్షిణ నగరమైన మేరియుపోల్‌లో వేలాది మంది మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మేరియుపోల్‌ను సర్వనాశనం చేశారని, వేలాది మంది అక్కడ మరణించి ఉంటారని చెప్పారు. ఇంత మారణహోమం జరిగినా రష్యా తన దండయాత్రను ఆపడంలేదని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ నగరం నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు పారిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ వేలాది మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. భారీ భారీ గొయ్యిల్లో ఆ మృతదేహాలను ఖననం చేశారు. చెచన్‌ ఫైటర్లు అక్కడ లూటీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆకలి, దాహాం తట్టుకోలేక షెల్టర్ల నుంచి బయటకు వెళ్లిన వారిని చంపేస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది..

పాస్ఫరస్‌ దాడులు జరగొచ్చు : బ్రిటన్‌..

ఉక్రెయిన్‌లో ఫాస్పరస్‌ బాంబులతో రష్యా దాడులుచేసే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరించింది. మేరియపోల్‌ నగరంలో రష్యా భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదముందని తెలిపింది. దీనిపై బ్రిటన్‌ రక్షణ మంత్రి వివరణ ఇచ్చారు. నిజానికి ఇప్పటికే డోనస్కీ ప్రాంతంలో ఆ రకమైన బాంబులను వాడినట్లు వెల్లడించారు. ఫాస్పరస్‌ బాంబులు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ బాంబులు తీవ్రమైన గాయాల్ని చేస్తాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ చెబుతోంది. ఫాస్పరస్‌ బాంబులు శరీరంలో అగ్నిని పుట్టిస్తాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఫాస్పరస్‌ బాంబులను పట్టణ ప్రదేశాల్లో వాడడం నిషేధం. ఫాస్పరస్‌ బాంబును ప్రయోగించిన సమయంలో.. వైట్‌ ఫాస్పరస్‌ ఆక్సిజన్‌తో కలిసి అంటుకుంటుందని, అది కొవ్వులో త్వరగా కరుగదని, దీని వల్ల మానవుల మాంసం కాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం డోనస్కీ, లుహాంస్క్‌ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు కూడా బ్రిటన్‌ చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement