Thursday, April 18, 2024

ఉజ్వల సబ్సిడీ పెంచిన కేంద్రం.. వినియోగదారులకు 300 ఆదా

ప్ర‌భ‌న్యూస్ : ఉజ్వల స్కీమ్‌ కింద గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న వినియోగదారులకు శుభవార్త. గరిష్ఠ ప్రయోజనాన్ని అందించేందుకు సబ్సిడీని రూ.312.48కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు రూ.300 వరకు ఆదా చేసుకునేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ గరిష్ఠ ప్రయోజనాన్ని పొందాలంటే ఉజ్వల స్కీమ్‌ వినియోగదారుల తమ బ్యాంక్‌ సబ్సిడీ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అనేక పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం ఇవ్వనుంది.

ఒకప్పుడు కేవలం రూ.500- 600 మధ్య ఉన్న వంటగ్యాస్‌ ధర ఇప్పుడు రూ.1000కి చేరువైంది. ఈ నేపథ్యంలో ఉజ్వల స్కీమ్‌ కింద గరిష్ఠ సబ్సిడీ రూ.174.86 నుంచి రూ.312.48 పెంచడం ఊరట కల్పించినట్టయింది. ఇతరులు గతంలో రూ.153.86 సబ్సిడీ పొందితే ప్రస్తుతం రూ.291.48 సబ్సిడీ పొందనున్నారు. ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకుంటున్నవారితో తమ సబ్సిడీ బ్యాంక్‌ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధా నం చేస్తే సరిపోతుంది. గ్యాస్‌ వినియోగదారులు ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement