Thursday, March 28, 2024

పదేళ్లకోసారి ఆధార్‌ అప్‌డేట్‌.. బయోమెట్రిక్‌ ద్వారా మార్చుకోవాలన్న​ యూఐడీఏఐ

యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యుఐడిఎఐ) డేటా అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి పదేళ్లకోసారి తమ బయమెట్రిక్‌ డేటా వివరాలను అప్‌డేట్‌ చేయాలని యుఐడిఎఐ వినియోగదారులను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌ కార్డులపై తమ బయోమెట్రిక్‌ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్‌ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తామని యుఐడిఎఐ తెలిపింది. నివేదికల ప్రకారం, పౌరుల ముఖం, ఐరిష్‌, వేలిముద్ర స్కాన్‌ను నవీకరించడానికి ప్రభుత్వం ప్రజలను ప్రేరేపిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వినియోగదారులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 5-15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ డేటాను నవీకరించాలి.

  • ఐదేళ్లలోపు వారి ఫొటో లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బయోమెట్రిక్‌ ప్రామాణికంగా ఆధార్‌లో నమోదవుతున్నారు. బాల-ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సమయంలో రిలేషన్‌షిప్‌ డాక్యుమెంట్‌ (జనన ధ్రువీకరణ పత్రం) సేకరించబడుతుంది. ఇది నీలం రంగులో జారీ అవుతుంది. ఐదేళ్ల వయసు వరకే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ ప్రక్రియ చేపట్టాలి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో 0-5 ఏళ్ల పిల్లలు 79 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మార్చి 31 చివరి నాటికి బాల-ఆధార్‌ కలిగివున్న వారి సంఖ్య 2.64 కోట్లు ఉన్నట్లు సమాచారం. జులై చివరి నాటికి ఈ సంఖ్య 3.43 కోట్లకు చేరింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement