Thursday, April 25, 2024

ఉగ్రం టీజ‌ర్ రిలీజ్ చేసిన నాగ‌చైత‌న్య‌

మ‌రో ప్ర‌య‌త్నానికి పూనుకున్నారు ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌. నాందితో హిట్ కొట్టిన హీరో అల్ల‌రి న‌రేశ్ తో మ‌రోసారి చేతులు క‌లిపారు. ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక కథలను .. పాత్రలను చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అల్ల‌రి న‌రేశ్. తాజాగా ఈ సినిమా నుంచి హీరో నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది.ఈ సినిమాతో మిర్నాటాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement