Tuesday, March 26, 2024

ఉగాది స్పెష‌ల్.. లంగావోణీలో సితార

ఉగాది పండుగ సంద‌ర్భంగా లంగావోణీతో ఫొటోల‌కి ఫోజులిచ్చింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. నూతన ఏడాది సందర్భంగా సితార పట్టు లంగావోణీలో దర్శనమిచ్చింది. ఈ ట్రెడిషనల్ డ్రెస్సులో సితార కుందనపు బొమ్మలా కనిపించింది. సితార ఘట్టమనేని ఫెస్టివ్ లుక్ ను తన తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన ముద్దుల తనయ ఎంత అందంగా కనిపిస్తుందో అంటూ మురిసిపోయారు. అలాగే అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సితార ఉగాది వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సితార ఫొటోలు చూసిన అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఎల్లో క‌ల‌ర్ ప‌ట్టు ప‌రికిణి..గ్రీన్ వోణీలో మెరిసిపోయింది ఈ చిన్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement