Thursday, April 25, 2024

పాప్ కార్న్ కి యు/ఎ సర్టిఫికెట్‌.. ఈ నెల‌ 10న రిలీజ్

విభిన్న‌మైన క‌థాంశంతో రూపొందింది పాప్ కార్న్ చిత్రం. ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.
ఈ చిత్రంలో అవికా గోర్‌ .. సాయి రోన‌క్ జంట‌గా నటించారు. ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా – నెపోలియ‌న్‌ ఈ సినిమాను నిర్మించారు. అవికా గోర్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకి, ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వహించాడు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాలోని చివరి 45 నిమిషాలు ఆడియెన్స్‌ లో ఉత్కంఠను రేకెత్తిస్తాయనీ, సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా అనిపిస్తుందని తెలిపింది అవికాగోర్.ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement