Thursday, April 25, 2024

ఇదేం విడ్డూరం..? అమ్మాయిని పెళ్లి చేసుకున్న మరో అమ్మాయి

వారిద్దరికీ చిన్ననాటి నుంచి స్నేహం ఉంది. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. అప్పుడే స్నేహం మొదలైంది. అది కాస్త పెరిగి పెద్దగా అయ్యేనాటికి ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పారు. వారు అంగీకరించలేదు. ఇద్దరు యువతుల మధ్య ప్రేమ..సమాజానికి విరుద్దమని తప్పని సూచించారు. దీంతో.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని.. ఏకంగా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

గురుగ్రామ్ కి చెందిన యువతి(20).. జాజర్ జిల్లాకు చెందిన మరో యువతి(19) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. వారి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. తప్పని నచ్చచెప్పారు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతలికీ వారి మాటలను వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు. ఈ విషయం తెలియని జాజర్ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్‌ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.

అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి. ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గు చూపుతున్నట్లు హెలినామ్డి పోలీస్ అధికారి మహేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement