Friday, September 27, 2024

Medchal: ఇద్దరి గొంతు కోసిన దుండగులు…

గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసి పరారైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామంలో బీహార్‌కు చెందిన పవన్ కుమార్‌, సంతోష్ కిష్టాపూర్ తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు.

గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement