Thursday, December 1, 2022

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇద్దరు సస్పెన్షన్‌..

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నిత్యం ఏదో రూపంలో వార్తలో కెక్కుతుంది. మొన్న విద్యార్థుల ఆందోళన, విద్యార్థి ఆత్మహత్య, మత ప్రచారం వంటివి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఉద్యోగులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇద్దరు సస్పెన్షన్‌ ను గురయ్యారు. విద్యార్థిని పట్ల ఉద్యోగులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అసిస్టెంట్‌ అకౌంటెంట్‌ సందీప్‌, అటెండర్‌ నర్సింహను ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ సస్పెండ్‌ చేశారు. డీఎస్పీ సురేష్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement