Friday, September 24, 2021

జమ్మూకశ్మీర్ లో కాల్పుల మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తర కశ్మీరులోని బందిపొరా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. సోక్ బాబా అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు,  భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News