Friday, June 18, 2021

కంటైనర్ లో మంటలు – ఇద్దరు అగ్నికి ఆహుతి

శంషాబాద్ లో ఓ భారీ కంటైనర్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఏసి కంటైనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న కంటైనర్ హిమాయత్ నగర్ వద్ద కు రాగానే మరో లారీని ఢీ కొట్టింది.

కాగా ప్రమాదంలో మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే కంటైనర్ తో సహా ఇద్దరు వ్యక్తులు అగ్నికి అహుతి అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News