Saturday, February 4, 2023

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి..

రేగొండ (ప్రభన్యూస్‌): జయశంకర్ జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి తాటికంటి రమేశ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం దుంపిల్లపల్లిలో దశ దినకర్మ నిర్వహిస్తుండగా బంధువులైన మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన గుండాల సురేశ్‌-భాగ్యలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు వర్షిత్‌ (7), కమలాపురం మండలం గుండెడు గ్రామానికి చెందిన నాంపల్లి కోటేశ్వర్రావు-రాణి దంపతులు కుమారుడు నాంపల్లి పరశురాం (11) తో కలిసి వచ్చారు. మృతుడు రమేష్‌ ఇంటి సమీపంలో ఉన్న దేశిదాయికుంట వద్దకు ఇద్దరు అబ్బాయిలు బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి కుంటలో పడిపోయారు.

- Advertisement -
   

ఈ ఘటన ఎవరు గమనించలేదు.. ఇక వారికి ఈత రాకపోవడంతో కుంటలో మునిగి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు రేగొండ ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లురేగొండ ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement