Wednesday, May 19, 2021

పేర్ని నాని నాగబాబు మధ్య ట్వీట్ వార్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పై రాజకీయ దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అధికార పార్టీ నాయకులంతా కూడా వకీల్ సాబ్ చిత్రంపై రకరకాలుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.అయితే మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీకు ఏమైంది నాని గారు… మీరు కరోనా వ్యాక్సిన్ తో పాటు రాబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. అర్జెంట్ ప్లీజ్. సెండ్ రాబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునేవారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే నాగబాబు చేసిన ట్వీట్ కు పేర్ని నాని రీట్వీట్ చేస్తూ ఆ వ్యాక్సిన్ నాకు కాదు…మీ ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి అవసరం అంటూ పోస్ట్ చేశారు.పరోపకారి పాపన్న నాగబాబుగారు పేర్ని నాని లాంటి బయట వారి కన్నా ముందు మన ఇంట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు వ్యాక్సిన్ అవసరం. వెంటనే వెతికి వేయించండి. ఆలస్యం అయితే మీకు కూడా అవసరమవుతుంది. అన్నదమ్ములు ఇద్దరికీ వ్యాధి తగ్గిన తర్వాత అప్పటికి అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News