Friday, April 26, 2024

తుపాకుల గూడెం.. రేపే విడుద‌ల‌

రేపే విడుద‌ల కానుంది తుపాకుల గూడెం చిత్రం.. ఈ సినిమా టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వైపున ఫారెస్టులో కలపను అక్రమంగా తరలించడం .. మరో వైపున నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్ధమైపోతోంది. ఈ మధ్యలో చిన్నపాటి ప్రేమ వ్యవహారం కూడా ఉందనే విషయం స్పష్టమవుతోంది.కలప అక్రమ వ్యాపారం చేసే రాజన్న దగ్గర, తుపాకుల గూడానికి చెందిన కుమార్ అనే యువకుడు పనిచేస్తూ ఉంటాడు. అతను చేసిన ఒక పనివలన ఆ ఊరు ఎలాంటి ప్రమాదంలో పడిందనేదే కథ. శ్రీకాంత్ రాథోడ్ .. జయేత్రి .. ప్రవీణ్ .. శివరామరెడ్డి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement