Thursday, April 25, 2024

‘సల్లాటి కుండలో సల్లసక్క మనసువాడు’ అంటున్న టక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా నుంచి ఓ మాస్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా ఈ వీడియోలో ముందుగా నాని, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణను పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ సాంగ్ కు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించడమే కాకుండా స్వయంగా పాడారు.

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్ను కోరి మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండో సినిమా టక్ జగదీష్. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, నాసర్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: జూనియర్ ఎన్టీఆర్ షో ఎఫెక్ట్.. పెరిగిన జెమినీ టీవీ రేటింగ్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement