Thursday, April 25, 2024

శ్రీవారి భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త.. రెండు రోజుల ముందు ప్రత్యేక దర్శన టికెట్ల బుకింగ్‌కు వెసులుబాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ శభవార్త తెలిపింది. ఇందుకోసం టీటీడీ రోజుకు వెయ్యి టికెట్లను టీఎస్‌ఆర్‌టీసీకి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం పట్ల సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వారు కేవలం రెండు రోజుల ముందు రిజర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుందని, ఈ విధానం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. టీటీడీ నిర్ణయం వల్ల టీఎస్‌ఆర్‌టీసీకి యాత్రికుల ఆదరణ మరింత పెరగుతుందని ఛైర్మన్‌ బాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల దర్శనం కోసం వెళ్ళే ప్రయాణికులు తప్పనిసరిగా రెండు డోస్‌ల కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌ను కానీ లేకపోతే 72 గంటల ముందు పొందిన కోవిడ్‌ 19 సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement