Saturday, March 23, 2024

టీఎస్‌పీఎస్‌సీ హార్టికల్చర్‌ పరీక్షా వాయిదా.. ఏప్రిల్‌ 4న జరగాల్సిన పరీక్షను జూన్‌ 17కి వాయిదా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 4వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పేపర్ల లీకేజీ కారణంగా తదుపరి పరీక్షలన్నీ రీషెడ్యూల్‌ చేయాలని టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 4వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసింది.

అందుకు సంబంధించిన ప్రకటనను ఈమేరకు మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్‌లో జరగాల్సిన మిగతా పరీక్షల తేదీలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడించే అవకాశముంది. యూపీఎస్‌సీ పరీక్షల తేదీలను బట్టి మిగతా పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేయాలని టీఎస్‌పీఎస్‌సీ కసరత్తు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement