Friday, April 19, 2024

TS EAMCET – జూన్ 26 నుంచి 19 వ‌ర‌కు ఎంసెట్ ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ..

హైద‌రాబాద్ : . ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో తెలంగాణ‌ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాలు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
జూన్ 26 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.
జూన్ 28 – జులై 7 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జూన్ 28 – జులై 8 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 8 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
జులై 12 – సీట్ల కేటాయింపు.
జులై 12 – 19 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
జులై 21 – 27 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).
జులై 23 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 21 – జులై 24 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 24 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
జులై 28 – సీట్ల కేటాయింపు
జులై 28 – 31 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
ఆగ‌స్టు 2- ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).
ఆగ‌స్టు 3 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆగ‌స్టు 2 – ఆగ‌స్టు 4 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆగ‌స్టు 4 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
ఆగ‌స్టు 7 – సీట్ల కేటాయింపు.
ఆగ‌స్టు 7 – ఆగ‌స్టు 9 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement