Tuesday, April 23, 2024

బైడెన్ స‌ర్కార్ పై ట్రంప్ ఫైర్‌..

ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికా తూటాల మోతతో వ‌ణికిపోయింది.. టెక్సాస్ లోకి ఓ స్కూల్ లో 18 ఏళ్ల బాలుడు తుపాకీతో మార‌ణ హోమం సృష్టించాడు. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 21 మందికి పైగా మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌య‌మై అమెరికాకు ఈ తూటాల తలనొప్పి ఎంత కాలం? అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌శ్నించారు. దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. దేశంలోని స్కూళ్ల భద్రత కంటే ఉక్రెయిన్ యుద్ధమే బైడెన్ సర్కారుకు ప్రాధాన్యంగా మారిందని విమర్శించారు. పాఠశాలల్లో భద్రతపై సర్కారు దృష్టి పెట్టాలని సూచించారు. ఉక్రెయిన్ కు యూఎస్ భారీగా నిధులు పంపిస్తోంది. ఇక్క‌డి పిల్ల‌ల భ‌ద్ర‌త‌ను ప‌క్క‌న పెట్టి ప‌క్క‌దేశాల‌ను ఉద్ద‌రించేది ఏముంద‌న్నారు. చిన్నారుల‌ను కాపాడుకునేందుకు మ‌నం ఏమైనా చేయాల‌న్నారు. ఆప్ఘానిస్థాన్ లో లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశాం. అందుకు మనకు ఒరిగిందేమీ లేదు. మిగిలిన ప్రపంచాన్ని, దేశాలను నిర్మించే ముందు.. సొంత దేశంలో మన పిల్లలకు సురక్షితమైన పాఠశాలలను నిర్మించాల్సి ఉంది అని ట్రంప్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement