హైదరాబాద్, ఆంధ్రప్రభ: వృత్తిలో నిబద్ధతతో పని చేసే ఉద్యోగులకు సమాజంలో నిజమైన గుర్తింపు లభిస్తుందని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జన్నార్ అన్నారు. టీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరితో పాటు మరో 8మంది బస్ భవన్ ఉద్యోగులు బుధవారం పదవీ విరమణ పొందారు.
- Advertisement -
ఈ సందర్భంగా రాణిగంజ్, బస్‌భవన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశాల్లో వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావంతో పని చేసే ఉద్యోగులకు సంస్థలో ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులంతా సుదీర్ఘకాలం నిబద్ధతతో పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. వారి విశ్రాంత జీవనం సంతోషంగా గడపాలని సూచించారు.