Tuesday, April 23, 2024

నాగార్జున సాగ‌ర్‌.. 9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ హవా..

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. ప్ర‌తి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుతోంది. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. తొమ్మిదో రౌండ్ ముగిసే స‌రికి 8,111 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వ‌చ్చాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వ‌చ్చాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వ‌చ్చాయి. ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోల‌య్యాయి. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement