Saturday, May 8, 2021

ఈటల వివాదంపై మాట్లాడొద్దు.. అధిష్టానం ఆదేశాలు

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంపై విచారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి ఈటల రాజేందర్ వివాదంపై ఎవరూ మాట్టాడొద్దని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈటల వ్యవహారంపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన నేతలు పలువురు ఖండించారు. ఈటల కష్టపడి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారని, రాజకీయాల్లోకి రాక ముందే వందల ఎకరాల భూములు, ఆస్తులు, కోళ్ల ఫామ్‌లు ఉన్నాయని చెబుతున్నారు. కావాలనే ఈటలపై నిందలు మోపుతున్నారని  ఆరోపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. శామీర్‌పేటలోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈటలపై వస్తున్న ఆరోపణలపై ఆయన అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల కోసం హైదరాబాద్ అభిమానులపై పోలీస్ లు నిఘా పెట్టారు. తనను కలిసేందుకు ఎవ్వరూ రావొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Prabha News