Saturday, December 10, 2022

టీఆర్ఎస్ గూండాలు నా ఇంట్లో చొర‌బ‌డి బీభ‌త్సం సృష్టించారు : ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్

బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు అర్వింద్ నివాసంపై దాడి చేశారు. ఈ దాడిపై ఎంపీ అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాల మేర‌కు హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడి జ‌రిగింది. టీఆర్ఎస్ గుండాలు ఇంట్లో వస్తువులు పగలగొడుతూ… బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు.. అంటూ ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు. అంతే కాదు, ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement