Wednesday, April 24, 2024

సూపర్ గ్లామ‌ర్ తో మెరిసిన త్రిష‌.. వైర‌ల్ గా ఫొటోలు

హీరోయిన్ త్రిష నటించిన లేటెస్ట్ మూవీ రాంగి డిసెంబర్ 30న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు కోసం త్రిష అదిరిపోయే లుక్ లో మెరిసింది. త్రిష వయసు అనూహ్యంగా వెనక్కి వెళుతోందా అనే అనుమానం కలగక మానదు. త్రిష లేటెస్ట్ ఫొటోస్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 25 ఏళ్ల యంగ్ బ్యూటీ లాగా త్రిష తాజాగా ఫొటోస్ లో కనిపిస్తోంది. ఆమె వయసు బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. బ్లూ ట్రెండీ డ్రెస్ లో త్రిష చిలిపిగా, క్యూట్ గా ఇస్తున్న ఫోజులు నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి. చంద్రబింబంలా వెలిగిపోతున్న ముఖంలో చిరునవ్వు మరింత ఆకర్షిస్తోంది.

39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పొన్నియన్ సెల్వం తమిళంలో మాత్రం మంచి విజయం దక్కించుకుంది. నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ త్రిష ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఆల్రెడీ త్రిషకి పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగి బ్రేకప్ అయింది. అందుకే త్రిష పెళ్లి విషయంలో తొందరపడటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement