Saturday, October 12, 2024

తరాలు మారినా మారని తలరాత.. గిరిజన గ్రామాల్లో కొనసాగుతున్న డోలీ మోతలు

మాడుగుల(అనకాపల్లి),(ప్రభన్యూస్‌) : తరాలు మారినా గిరిజనలు తలరాతలు మారడం లేదు. రవాణా సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కోటాది రూపాయలు ఖర్చు చేస్తున్నా గిరిజన గ్రామాలకు తగిన రవాణా సౌకర్యం అందరి ద్రాక్షగానే మిగిలింది. ఇక్కడ ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీ మోత ద్వారానే ఆసుపత్రికి తరలించే పరిస్థితి నెలకొంది. వి.మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ శివారు గ్రామమైన కామకూటం గ్రామానికి చెందిన గర్భిణీ ప్రతిమకు పురిటి నొప్పులు రావడంతో కింతలి పిహెచ్సి వైద్యులకు బుధవారం తెలియ జేశారు.

రహదారి మొత్తం బురద మయం కావడంతో వైద్య సిబ్బంది కామకూటం గ్రామానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పురిటి నొప్పులతో బాధపడు తున్న గర్భిణీ ప్రతిమను డోలీ కట్టి డోలిమోతల ద్వారా కొండవీధి గ్రామం వరకు భుజాలపై మోసుకుంటూ వచ్చి అక్కడ నుండి కింతలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ వలసిన పరిస్థితి ఏర్పడడంతో గిరిజనుల డోలీ మోతల ద్వారా ఆస్పత్రికి తరలించారు.

డోలీ మోతలతో వెళ్లినటు-వంటి గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ బుధవారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. క్షేమంగా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలో ఉన్న గిరిజన గ్రామమైన కామకూటం గ్రామానికి రోడ్లు లేకపోవడం సిగ్గుచేటని ఇప్పటి-కై-నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కామకూటం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement