Monday, June 5, 2023

ర‌హ‌దారికి అడ్డుగా చెట్లు.. మావోయిస్టుల ప‌నే

నేడు నిర్వ‌హిస్తున్న బంద్ కు నిర‌స‌న‌గా మావోయిస్టులు దుర్వగుడి-బుడ్జెటప్ప మధ్య 130సి జాతీయ రహదారినకి అడ్డుగా చెట్లను నరికి వేశారు. ఆ ప్ర‌దేశంలో బ్యానర్లు, పోస్టర్లు వేసి వెళ్లారు. అయితే ఒడిశా రాష్ట్ర కమిటీ పేర బ్యానర్లు పోస్టర్లు ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో గరియాబంద్, ధమ్తరి, కొండగావ్, మహా సముంద్ జిల్లాల బంద్ పిలుపునిస్తూ లేఖలు వదిలి వెళ్లారు. ఆ లేఖ ద్వారా పోలీసు క్యాంపులను మూసివేయాలని హెచ్చరిక చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్ చేశారు. రాత్రి ఈ ఘటన జరిగినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ చంద్రేష్ ఠాకూర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement