Saturday, April 1, 2023

తెలంగాణ‌లో 15 మంది ఐఏఎస్ అధికారుల బ‌దిలీ.. హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్‌గా సిక్త ప‌ట్నాయ‌క్‌

వరంగల్ : హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును బ‌దిలీ అయ్యారు. ఆయ‌న‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇవ్వాల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక‌.. హన్మకొండ కలెక్టర్ గా సిక్త పట్నాయక్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో వారం రోజుల క్రితం 91మంది పోలీసు ఉన్న‌తాధికారుల‌ను, అందులో 51 మంది ఐపీఎస్ అధికారుల‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఐఏఎస్ లను సైతం బదిలీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
   

ఈ క్రమంలోనే హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నిజామాబాద్ కు బదిలీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆదిలాబాద్ కలెక్టర్ గా ఉన్న 2014 బ్యాచ్ కు చెందిన సిక్తా పట్నాయక్ ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement