Sunday, December 4, 2022

విషాదం… న‌దిలో మునిగి న‌లుగురు మృతి

కైల్‌ నదిలో మునిగి న‌లుగురు యువ‌కులు మృతి చెందిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని దేవల్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ పరిధిలోని కల్సిరిలో పరిధి చోటు చేసుకున్నది. నలుగురు యువకులు కనిపించకుండా పోయారు. న‌దిలో మృతదేహాలుగా క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అంఒదించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నదిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. నదిలో నలుగురు యువకులు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవగా.. వారి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. యువకుల మరణాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈత కోసం వెళ్లి మృతి చెందారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement