Friday, March 29, 2024

రోడ్డుపై కంక‌ర – చీపురుతో శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీస్-80వేల లైక్స్

ఓ ట్రాఫిక్ పోలీసు చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ గా మారింది. రోడ్డుపై ప‌డి ఉన్న చిన్న చిన్న రాళ్ల‌ను ఆ పోలీసు స్వ‌యంగా చీపురు చేత‌బ‌ట్టి శుభ్రం చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.ఈ వీడియోని ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మిమ్మల్ని గౌరవిస్తున్నా’ అని అందులో తెలిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది ఆయన ప్రస్తావించలేదు.కంకరను తీసుకెళ్లే వాహ‌నం నుంచి చిన్నచిన్న కంకర రాళ్లు రోడ్డుపై పడ్డాయి. వాటితో ద్విచక్ర వాహనాలు జారే ప్రమాదంతోపాటు వాటి టైర్లు పంక్చర్‌ అయ్యే అవకాశముంది. ఇది గ్రహించిన అక్క‌డి ట్రాఫిక్‌ పోలీస్ అధికారి వెంటనే స్పందించారు.

రెడ్ సిగ్నల్‌ పడగానే చీపురు చేత పట్టి రోడ్డుపై పడిన కంకరను పక్కకు ఊడ్చారు. ఈ సందర్భంగా వాహనాలు ఆయన వైపు రాకుండా ఒక వాలంటీర్‌ సహకరించాడు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ‘రెస్పెక్ట్ ఫర్ యు’ అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌గానే.. చీపురు ప‌ట్టుకుని రోడ్డు శుభ్రం చేస్తున్నట్టు.. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చగా మారడంతో ట్రాఫిక్‌కు దిశానిర్దేశం చేస్తున్న పోలీసు వెనుక ఉన్న మరొక వ్యక్తిని కూడా వీడియో లో చూడ‌వ‌చ్చు. ఈ వైరల్ వీడియో 1.4 మిలియన్లకు పైగా నెటిజ‌న్లు చూడ‌గా.. 80,000 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. రోడ్డును ఊడ్చిన ట్రాఫిక్‌ పోలీస్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. విధి నిర్వాహణలో ఆయన సిన్సియార్టీని నెటిజన్లు కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement