Thursday, April 18, 2024

పసిపిల్లల అక్రమ రవాణా.. చిన్నారులను అపహరిస్తున్న ముఠా అరెస్టు!

కేరళలో చిన్నారిని అపహరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పసిపిల్లలను అపహరించే ముఠాతో వీరికి సంబంధాలున్నాయా లేదా అన్నదానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. నిన్న (ఆదివారం) తెల్లవారు జామున తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లా పొలాచ్చిలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఓ ఐదు రోజుల నవజాత శిశువు కనిపించకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు కంప్లెయింట్​ చేయగా వారు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం తమిళనాడు పోలీసులు 12ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళలు ఓ పసికందుని తీసుకెళ్తున్న దృశ్యాలు సిటీ రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. వారు పొల్లాచ్చి నుంచి బస్సు ఎక్కి రైలులో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు వెళ్లినట్లు తెలిసింది. ప్రత్యేక బృందం పాలక్కాడ్ సమీపంలోని కొడువాయూర్‌కు చేరుకుని ఎట్టకేలకు ఆ చిన్నారిని రక్షించింది. సోమవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో వారు శిశువును తల్లి దివ్యభారతికి అప్పగించారు.

కాగా, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ఒక మహిళ, ఆమె టీనేజ్ కుమార్తెను పోలీసులు ఈ కేసులో అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చిలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పసికందును కిడ్నాప్ చేసినట్టు కనిపెట్టారు. ఆ మహిళను 34 ఏళ్ల షమీనాగా గుర్తించగా.. దీనికి ఆమె 14 ఏళ్ల కుమార్తె సాయం చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ పాలక్కాడ్‌కు చెందినవారనేనని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పోలీస ఎంక్వైరీ కొనసాగుతోందని, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో సదరు మహిళ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిందా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement