Thursday, December 5, 2024

TG | కులగణన సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ చీఫ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉంచేందుకు ఇందిరాభవన్‌లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కులగణన కనెక్టింగ్‌ పేర ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని టీపీసీసీ చీఫ్‌ బొమ్మా మహేష్‌కుమార్‌ గౌడ్‌ శనివారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ , మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, బీసీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఫహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement