Thursday, November 7, 2024

TG | టీపీసీసీ చీఫ్ మహేష్ జిల్లా స్థాయి సమావేశాలు…

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో శనివారం వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ డీసీసీలతో మహేష్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

కొత్త, పాత నేతలు సామరస్యంగా పని చేయాలని సూచించారు. పదవులు పొందిన వారు ఓ మెట్టు దిగివచ్చి ప్రవర్తించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నదే తన ప్రయత్నమని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంపై టీపీసీసీ చీఫ్ పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. టీపీసీసీ కమిటీల పునర్వ్యవస్థీకరణకు ముందు మహేశ్ జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement