Thursday, April 25, 2024

Tomato Price Fall: మళ్లీ పడిపోయిన టమాట ధరలు.. ఆందోళ‌న‌లో రైతులు

ట‌మాటా లేని కూర‌లు ఉండ‌వు.. కొన్ని సంద‌ర్భాల్లో రూ.100 వ‌ర‌కు ధ‌ర పెట్టి కూడా కొనుగోలు చేశాం.. పంట స‌మ‌యంలో వ‌ర్షాలు అతివృష్టి.. అనావృష్టి మాధిరి రైతులు పండించే పంట ధ‌ర కూడా అదేవిధంగా త‌యారైంది. మొన్న‌టిదాకా రూ.40 వ‌ర‌కు ప‌లికిన కిలో ట‌మాటా ధ‌ర ఇప్పుడు ఏకంగా రూ.2 నుంచి 4 వ‌ర‌కు ప‌లుకుతోంది. దీంతో కర్నూలు జిల్లా టమాటా రైతులు బోరుమంటున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో భారీగా పలికిన టమాటా ధర ఒక్కసారిగా 2 రూపాయలకు పడిపోవడంతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. దిక్కుతోచని రైతులు వాటిని అక్కడే పారబోసి వెళ్లిపోయారు. ఒక ఎకరాలో టమాటా పంట పండించేందుకు రైతులు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చాక ధర అమాంతం పడిపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మార్కెట్ లో పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్ లో మాత్రం కిలో టమాటా రూ. 20 నుంచి రూ. 30 పలుకుతుండడం గమనార్హం. కిలోకు రూ.10-15 అయినా లభిస్తే తమకు కొంతవరకు గిట్టుబాటు అయ్యేదని రైతులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement