Thursday, April 25, 2024

ఏపీ సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ.. ఎప్పుడంటే?

ఏపీలో సినిమా టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌‌లోనే కొనుగోలు చేసేలా విధానాన్ని తీసుకు రావాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని, సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని వివరించారు. పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందని బ్లాక్ టిక్కెట్ల అమ్మకాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పేర్నినాని వెల్లడించారు.

ఏపీలో వినోదాన్ని కోరుకునే ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో ఇచ్చామని స్పష్టం చేశారు. ఇక సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్‌తో భేటీ అవుతామని కోరారని, ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదర్లేదని వివరించారు. త్వరలోనే సినీ పెద్దలు సీఎంతో భేటీ కానున్నారని స్పష్టం చేశారు. అయితే.. ఈనెల 20న సీఎం జగన్‌‌తో సినిమా ఇండస్ట్రీ పెద్దలు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement