Saturday, March 23, 2024

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్.. దిల్ రాజు భార్య సినిమాల్లోకి రానున్నారా..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు భార్య సినిమాల్లోకి రానున్నార‌ని స‌మాచారం. దిల్ రాజు రెండవ భార్య తేజస్విని కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడట. ఆమెకు చాలా కాలంగా ఉన్న కోరిక తీర్చడానికి దిల్ రాజు కోట్లు పెట్టుబడిగా పెట్టబోతున్నట్టు సమాచారం. దీనికి సబంధించి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. దిల్ రాజు కంటే చాలా చిన్నదైన తేజస్వినికి మోడలింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట. ఆమెకు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. కానీ ఫ్యామిలీలో ఇటువంటివి ఒప్పుకోకపోవడంతో.. ఆ కోరికను చంపేసకుందట తేజస్వీని.. అయితే ఈ విషయం పెళ్లి తరువాత తన భర్తకు చెప్పడంతో దిల్ రాజు ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక తేజస్విని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ అమలు చేశారని.. దీని కోసం ఆయన ఏకంగా కోట్లు ఖర్చు చేసి ఆమెను మోడలింగ్ రంగంలోకి దింపుతున్నాడని స‌మాచారం. అంతేకాదు అన్ని కుదిరితే దిల్ రాజు భార్య హీరోయిన్ గా కాని.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కాని ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంది. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిస్టీబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు.. అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా కథ విషయంలో కాని.. సక్సెస్ విషయంలో కాని ఆయన అంచనాలు పర్ఫెక్ట్ గా నిజం అవుతాయన్న పేరు ఉంది. అందుకే ఆయన ఈ రేంజ్ కు వచ్చాడంటారు. ఇండస్ట్రీలో ఏది ఎప్పుడు జరగాలి అనేది శాసించేంత స్థాయికి దిల్ రాజు ఎదిగారు. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా టార్గెట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement